iPhone 14: డోంట్ మిస్ ది ఛాన్స్… అతి తక్కువ ధరకే మీ సొంతం

iphone14
Love to Share

iPhone 14: అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఐఫోన్ 14పై భారీ ఆఫర్లను అందించనుంది.

Big Offers on iPhone 14

యాపిల్ (Apple) కంపెనీ ఈ ఏడాది ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాత సిరీస్ అయిన ఐఫోన్ 14 మోడళ్ల ధరలు తగ్గాయి. అయితే ఐఫోన్ 14 ధరలు మరింత తగ్గనున్నాయి. అన్ని డిస్కౌంట్లు కలిపి స్పెషల్ సేల్‌లో దీన్ని రూ. 50వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఆఫర్‌ను గెస్ చేయాలని, హ్యాండ్‌సెట్ ధరను అంచనా వేయాలని కస్టమర్లను ఫ్లిప్‌కార్ట్ టీజర్ పేజీలో అడుగుతోంది. ఈ లెక్కన చూస్తే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 14 రూ. 49,999 లేదా అంతకంటే తక్కువకే లిస్ట్ కావచ్చు. బ్యాంక్ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లతో ఈ ప్రీమియం ఫోన్ ధర భారీగా తగ్గవచ్చు.

ఎక్స్చేంజ్ ఆఫర్: ఐఫోన్ 14పై ఏకంగా రూ. 30వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ టీజర్‌లో కన్ఫర్మ్ చేసింది. స్పెషల్ సేల్‌లో ఈ ఆఫర్లు లిమిటెడ్ పీరియడ్ వరకే అందుబాటులో ఉంటాయని పోర్టల్ వెల్లడించింది. ప్రమోషన్‌కు, తమకు సంబంధం లేదని, బ్రాండ్స్ లేదా సెల్లర్స్ ఈ ఆఫర్లను స్పాన్సర్ చేస్తాయని పేర్కొంది.

టీజర్ ఇమేజ్‌పై క్లిక్ చేస్తే, కొత్త ల్యాండింగ్ పేజీ ఓపెన్ అవుతోంది. దీంట్లో ఐఫోన్ 14 ధర ప్రస్తుతం రూ. 69,900 నుంచి రూ. 64,999కి తగ్గినట్లు చూపిస్తోంది. స్పెషల్ సేల్ ప్రారంభమయ్యే వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండవచ్చు.

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు: యాపిల్ ఐఫోన్ 14 గత ఏడాది లాంచ్ అయింది. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో హ్యాండ్‌సెట్ బెస్ట్ స్క్రీనింగ్ అవుట్‌పుట్ అందిస్తుంది. 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కెపాసిటీ దీని సొంతం. సిరామిక్ షీల్డ్ మెటీరియల్‌ ప్రొటెక్షన్‌ స్క్రీన్‌కు ఉంటుంది.

ఐఫోన్ 14లో A15 బయోనిక్ చిప్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఫోన్ ముందు భాగంలో f/1.9 ఎపర్చర్ లెన్స్‌తో కూడిన 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ ట్రూడెప్త్ కెమెరా అందించారు. 6GB RAM, 3,279mAh బ్యాటరీతో డివైజ్ లాంచ్ అయింది.  iPhone 14 రియర్ కెమెరా సెటప్‌లో రెండు లెన్స్ ఉన్నాయి. f/1.7 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 120 డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో f/2.4 అపెర్చర్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 12-మెగాపిక్సెల్ సెన్సార్‌ బెస్ట్ ఫోటోగ్రఫీ అవుట్‌పుట్ అందిస్తాయి.

గమనిక: ఇంటర్నెట్ లో దొరికిన సామాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ఆఫర్లపై తుది నిర్ణయం మీదే. గమనించ మనవి.

Love to Share
Scroll to Top