Multibagger: రూ.2 లక్షలకు రూ.4 లక్షలు. ఈ షేరు మీరు కొన్నారా?

Man Industries India share price
Love to Share

Multibagger: ఈ స్టాక్ కొన్న వారికి ఏడాదిలోనే తమ పెట్టుబడి రెండింతలైంది. ఏడాదిలోన్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించి ఇన్వెస్టర్లను మిలియనీర్లను చేసింది. రూ. 1 లక్ష పెడితే రూ.2 లక్షలు చేసింది. ఆ స్టాక్ వివరాలు ఇప్పుడే తెలుసుకోండి మరి.

Multibagger: మ్యాన్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ (Man Industries India Limited). ఈ స్టాక్ గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఈ ఏడాది సమయంలో అంటే సెప్టెంబర్ 26, 2022 రోజున ఈ కంపెనీ స్టాక్ విలువ రూ. 88.95 వద్ద ఉండగా ఇప్పుడు అది సెప్టెంబర్ 27, 2023 రోజున రూ. 183కు పెరిగింది. అంటే ఈ ఏడాది కాలంలో 100 శాతం పెరిగింది.

సరిగ్గా ఏడాది క్రితం రూ. 1 లక్ష పెట్టి మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు వాటి విలువ రూ. 2 లక్షలు అవుతుంది. అలాగే రూ. 5 లక్షలు పెట్టిన వారికి వారి పెట్టుబడి రూ. 10 లక్షలు అవుతుంది. ఈ ఆర్థిక ఏడాది 2023- 24 తొలి త్రైమాసికం ఫలితాల్లో ఈ కంపెనీ నెట్ ప్రాఫిట్ 13.92 శాతం పెరింగి రూ. 11. 21 కోట్లుగా నమోదు చేసింది.

అంతకు ముందు ఏడాది నెట్ ప్రాఫిట్ రూ. 9.84 కోట్లుగా నమోదైంది. అయితే, కంపెనీ నెట్ సేల్స్ ఈ ఏడాది క్యూ1లో 3.93 శాతం పడిపాయి రూ. 490.42 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ ఆర్డర్ బుక్ రూ.1900 కోట్లుగా ఉంది.

మ్యాన్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ మన దేశంలో ఎల్ఎస్ఏడబ్ల్యూ, హెచ్ఎస్ఏడబ్ల్యూ పైపుల తయారీ, ఎగుమతుల్లో అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా ఉంది. 1 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంది. ఈ కంపెనీకి రెండు ప్లాంట్లు ఉన్నాయి. అందులో ఒకటి గుజరాత్, కుచ్ జిల్లాలోని అజ్నర్ ప్రాంతంలో ఉండగా రెండోది మధ్యప్రదేశ్ లోని పితాంపుర్ లో ఉంది.

మంగళవారం సెప్టెంబర్ 26 ట్రేడింగ్ రోజున చూస్తే ఈ కంపెనీ స్టాక్ రూ.180 వద్ద ప్రారంభమైంది. ఒక స్థాయిలో రూ. 195.55 గరిష్ఠ స్థాయిని తాకింది. ప్రస్తుతం 6.53 శాతం పెరిగి రూ. 191 స్థాయి వద్ద ట్రేడింగ్ అవుతోంది.

Disclaimer: The above content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.

Love to Share
Scroll to Top