Stanford University: సైబర్‌ సెక్యూరిటీ కోర్సు పూర్తిగా ఉచితం… విద్యార్థులకు బంపరాఫర్

Love to Share

Stanford University:  ప్రస్తుతం సైబర్ అటాక్స్ పెరిగిపోవడంతో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సైబర్ సెక్యూరిటీపై ఫ్రీ ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా ఉచిత ఆన్‌లైన్ కోర్సును ఆఫర్ చేస్తోంది.

ప్రపంచ అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో స్టాన్‌ఫోర్డ్ (Stanford University) ఒకటి. ఈ వర్సిటీలో చదువుకోవడం చాలా మంది కల. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే ఈ ప్రఖ్యాత విద్యా సంస్థ, ఇప్పుడు ఎటువంటి ఫీజు లేకుండా చదువుకునే అవకాశంకల్పిస్తోంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా ఉచిత ఆన్‌లైన్ కోర్సు (Free Online Course) ను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం సైబర్ అటాక్స్ పెరిగిపోవడంతో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సైబర్ సెక్యూరిటీపై ఫ్రీ ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ అందిస్తున్న సైబర్‌ సెక్యూరిటీ కోర్సు పరిధి విస్తృతంగా ఉంటుంది. ఈ కోర్సును వివిధ విభాగాలుగా విభజించారు. వాటి వ్యవధి కూడా వేర్వేరుగా ఉంటుంది. కోర్సు భాగాలను బట్టి రెండు, ఎనిమిది, పది గంటల వరకు వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు తమ సమయం లభ్యత, ప్రాధాన్యతల ఆధారంగా వాటిని ఎంచుకోవచ్చు. కోర్సు అడ్మిషన్స్‌పై సమగ్ర వివరాల కోసం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ అధికారిక పోర్టల్ https://online.stanford.edu/ విజిట్ చేయాలి.

కరిక్యులమ్ వివరాలు

కోర్సులో భాగంగా నెట్‌వర్క్ సెక్యూరిటీ, డిజిటల్ ఆస్తులను రక్షించడం, అటాక్స్ డిఫెండ్ చేయడం, కస్టమర్ గోప్యతను నిర్ధారించడం వంటి అంశాలపై కరిక్యులమ్ ఫోకస్ చేస్తుంది. ఈ కోర్సు ద్వారా సైబర్ అటాక్స్‌ను నిరోధించడం. సేఫ్‌గార్డ్ వ్యూహాలు, అలాగే అడ్వాన్స్‌డ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సిస్టమ్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఈ డొమైన్‌లలో విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరచడం ఈ కోర్సు అసలు లక్ష్యం.

ఫ్యాకల్టీ సభ్యుల వివరాలు

ఈ కోర్సును సక్సెస్‌పుల్‌గా కంప్లీట్ చేసిన తరువాత సర్టిఫికేట్‌ ప్రదానం చేస్తారు. కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ జాన్ మిచెల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాన్ బోనెహ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్అండ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ నిక్ మెక్‌కాన్, కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాకీర్ డుమ్‌రూమెరిక్‌ వంటి ఫ్యాకల్టీ సభ్యులు ఈ కోర్సును పర్యవేక్షించనున్నారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఆన్‌లైన్ సైబర్ సెక్యూరిటీ కోర్సు పూర్తిగా ఉచితం. ఎలాంటి ఫీజు ఉండదు.

ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా జీతాలు

భారత్‌లో సగటున నాలుగు నుంచి తొమ్మిది సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న మిడ్-కెరీర్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ వార్షిక జీతం రూ.12 లక్షలుగా ఉంది. 10 నుంచి 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి యాన్యువల్ ప్యాకేజీ రూ .22లక్షల నుంచి రూ.23 లక్షల వరకు ఉండవచ్చు. ఈ నేపథ్యంలో స్టాన్‌ఫోర్డ్ ఆఫర్ చేస్తున్న సైబర్ సెక్యూరిటీ కోర్సులో జాయిన్ కావడం వల్ల కెరీర్ భవిష్యత్‌కు సెక్యూరిటీ లభిస్తుంది. ఈ కోర్సు చేసిన తర్వాత సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా కెరీర్ ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. మంచి ప్యాకేజీతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.

1885లో వర్సిటీ స్థాపితం లేలాండ్ స్టాన్‌ఫోర్డ్, అతని భార్య జేన్ కలిసి 1885లో అమెరికాలోని కాలిఫోర్నియాలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. టైఫాయిడ్ జ్వరం కారణంగా 15 ఏళ్ల వయసులో మరణించిన వారి కుమారుడు లేలాండ్ స్టాన్‌ఫోర్డ్ జూనియర్ జ్ఞాపకార్థం ఈ వర్సిటీని స్థాపించారు. కో-ఎడ్యుకేషన్, నాన్-డినామినేషన్‌ ఎడ్యుకేషన్‌కు ఈ వర్సిటీ గుర్తింపు పొందింది.

గమనిక: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ రాయడం జరిగినది. ఖచ్చితమైన సమాచారం కోసం వెబ్సైట్ ను చూడగలరని మనవి.

Love to Share
Scroll to Top