Super Savings Scheme for Employees: ఉద్యోగులూ… ఈ స్కీమ్‌తో కోటిన్నర మీ సొంతం.

Saving Scheme for Employees
Love to Share

రిస్క్ లేకుండా రిటర్న్స్ ఇచ్చేవి ప్రభుత్వ పథకాలు మాత్రమే. ఎందుకంటే వీటిలో ఎంత రిటర్న్స్ వస్తాయని ముందుగానే చెప్తారు కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. రిటర్న్స్ పైన ముందుగానే అంచనా ఉంటుంది.

Saving Scheme for Employees

కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కోసం Small Saving Schemes నిర్వహిస్తోంది. అందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ ఒకటి. ఉద్యోగులతో పాటు ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ స్కీమ్‌లో డబ్బులు పొదుపు చేసి మంచి రిటర్న్స్ పొందొచ్చు.

పన్ను ఆదా చేయడానికి అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి పథకాల్లో పీపీఎఫ్ కూడా ఒకటి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. కేవలం రూ. 500 నుంచి పొదుపు ప్రారంభించవచ్చు.

రిటైర్మెంట్ అవసరాల కోసం ఈ స్కీమ్‌లో పొదుపు చేయొచ్చు. ఈ స్కీమ్‌లో 15 ఏళ్ల లాకిన్ ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1,50,000 వరకు పొదుపు చేయొచ్చు. ఒకేసారి లేదా 12 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రూ. 1,50,000 పొదుపు చేసే వీలుంది.

ఇందులో ప్రతీ ఏటా డిపాజిట్ చేసే మొత్తానికి సెక్షన్ 80సీ కింద రూ. 1,50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంలో దాచుకున్న డబ్బులకు 7.1 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీకి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మెచ్యూరిటీ సమయంలో వచ్చే డబ్బులకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇలా మూడుసార్లు పన్ను మినహాయింపు పొందవచ్చు.

పీపీఎఫ్ స్కీమ్‌లో దీర్ఘకాలం పొదుపు చేయడం ద్వారా కోటీశ్వరులు కావొచ్చు. ఉదాహరణకు ఓ వ్యక్తి ప్రతీ ఏటా రూ.1,50,000 చొప్పున పీపీఎఫ్‌లో పొదుపు చేస్తున్నారనుకుందాం. 15 ఏళ్లు లాకిన్ ఉంటుంది కాబట్టి 15 ఏళ్లు తప్పనిసరిగా పొదుపు చేయాలి. ఆ తర్వాత ఐదేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ ఈ స్కీమ్‌ను పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

30 ఏళ్లు పొదుపు చేయాలని అనుకుంటే 30 ఏళ్లల్లో పొదుపు చేసే మొత్తం రూ.45,00,000 అవుతుంది. 7.1 శాతం వార్షిక వడ్డీ ప్రకారం 30 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో రూ.1,09,50,911 వడ్డీ వస్తుంది. అసలు వడ్డీ కలిపి మొత్తం రూ.1,54,50,911 రిటర్న్స్ లభిస్తాయి. అంటే 30 ఏళ్ల పాటు ఏటా రూ.1,50,000 చొప్పున పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో కోటిన్నర పొందొచ్చు. ఈ మొత్తానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పైన చెప్పిన ఉదాహరణ ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 7.1 శాతం ప్రకారం లెక్కించినది. ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. వడ్డీ రేటు పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. వడ్డీ రేటు పెరిగితే ఎక్కువ రిటర్న్స్, వడ్డీ రేటు తగ్గితే తక్కువ రిటర్న్స్ వస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి.

Disclaimer: This story is prepared with the information taken from the internet. Please contact the experts before taking any decision based on this information. Docmediads.com is not giving any surety or guarantee for this information.

Love to Share
Scroll to Top