Blog లేకుండానే ఈ మూడు పద్ధతుల్లో Affiliate Marketing చేయవచ్చు

Affiliate Marketing without blog
Love to Share

అవును, బ్లాగ్ లేదా వెబ్సైట్ లేకుండానే affiliate marketing చేసి డబ్బులు సంపాదించవచ్చు.

Social Media Channels: సోషల్ మీడియా చానల్స్ ద్వారా affiliate marketing చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఎటువంటి బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ అవసరం లేదు. Facebook, Instagram, Youtube, Twitter, Reddit, Pinterest, Vine Camera, Ask and Answer – ASKfm, LinkedIn, Tumblr, Flickr, Meetup and Classmates ఇటువంటి ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ పోస్టుల ద్వారా, కామెంట్స్ లో అలాగే ప్రొఫైల్ ద్వారా మీ affiliate links ను కస్టమర్లకు చెరవేస్తాయి.

ఈ ప్లాట్ ఫామ్స్ లో మీ మీ affiliate links ను షేర్ చేసే ముందు ఆయా చానల్స్ కు సంబంధించిన నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకొని వాటిని పాటించాలి. ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ లో మనం విజిటర్స్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఏదైనా వస్తువును గానీ, సర్వీస్ ను గానీ ఇతరులకు అమ్మాలి అనుకున్నపుడు ఒక కంట్రిబ్యూటర్ గా వ్యవహరించాలి. సదరు కమ్యూనిటీ యొక్క వాల్యుని పెంచగలగాలి. అప్పుడే affiliate marketing ద్వారా డబ్బుని సంపాదించడం సాధ్యమవుతుంది.

Email Marketing: ఈ మెయిల్ ద్వారా మీ వస్తువులను అమ్మడానికి వెబ్సైట్ అవసరం లేదు. Subscribers ని పెంచుకోవడంలో మాత్రం వెబ్సైట్ ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి. మీ దగ్గర కస్టమర్ల లిస్ట్ పెద్దదిగా ఉన్నట్టయితే మళ్ళీ మళ్ళీ మీ ప్రాడక్ట్స్ ను అమ్మడానికి ఈ మార్గం సులువవుతుంది. ఈ మెయిల్ మార్కెటింగ్ పద్ధతిని సరిగా ఉపయోగించినత్తయితే మీ ఉత్పత్తులను చాలా ఎక్కువ మొత్తంలో అమ్మడానికి వీలవుతుంది.

E-Mail Marketing

Create A Video Channel On Sites Such As YouTube: చదివిన దానికంటే, విన్నదానికంటే, చూసినప్పుడే దేన్నైనా మనం సరిగ్గా అర్థం చేసుకోగలం. ఇది ఎవరి విషయంలోనైనా ఒకటే. మీ ప్రాడక్ట్స్ లేదా సర్వీసులకు సంబంధించిన నియమ నిబంధనలను, ప్రొడక్ట్ యొక్క విలువను వీడియోల రూపంలో రూపొందించవచ్చు. ఇలాంటి వీడియోల description లో మన affiliate links ను ఉంచవచ్చు. ఈ ప్రోడక్ట్స్ యొక్క డిమాండుని బట్టి మార్కెట్ లో మీకు కాంపిటీషన్ ఎదురవుతుంది.

Media Channels
Love to Share
Scroll to Top