తక్కువ కాంపిటీషన్ కలిగి ఉన్న blog niches

Loww competition niches
Love to Share

బ్లాగింగ్ ఇండస్ట్రిలో రోజూ రోజుకి చాలా మార్పులు వస్తున్నాయి. ఈ ఫీల్డ్ లోకి వచ్చేవారు బహుశా అన్ని మెళకువలను తెలుసుకునే  ఈ రంగంలోకి అడుగు పెడతారు.

కొత్తగా ఈ రంగంలోకి వచ్చిన వారు బ్లాగింగ్ లో ప్రొఫెషనల్ కావడానికి లైఫ్ స్టైల్, ఆరోగ్యం, ఎడ్యుకేషన్ వంటి అంశాలపై ఆర్టికల్స్ రాసేందుకు మొగ్గుచూపుతారు. అయితే ఈ అంశాలపై ఇప్పటికే చాలా బ్లాగ్స్ అందుబాటులో ఉన్న కారణంగా పైన చెప్పిన అంశాలలో బ్లాగ్స్ రాసి సక్సెస్ సాధించడం కాస్త కష్టంగానే ఉంటుంది.

అందుకని, తక్కువ కాంపిటీషన్ ఉన్న అంశాలపై బ్లాగ్స్ రాస్తే సక్సెస్ సాధించడం సులువవుతుంది.

తక్కువ కాంపిటీషన్ ఉండే ఐదు niche ఐడియాలను చూడండి.

1. ఆన్లైన్ లో డబ్బు సంపాదించడం: టెక్నాలజీ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో ఆన్లైన్ లో డబ్బు సంపాదించే మార్గాల కోసం వెతకడం ఎక్కువైంది. కాబట్టి ఆన్లైన్ లో డబ్బు సంపాదించగలిగే ఐడియాలపై రీడర్స్ ను ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఐడియా అవుతుంది.

2. ఫైనాన్స్ మరియు పెట్టుబడి: ఈ అంశంపై బ్లాగ్స్ రాయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఫైనాన్స్ మరియు పెట్టుబడి విధానాల మీద చాలా మందికి అవగాహన తక్కువగా ఉంటుంది. ఈ అంశంపై ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వగలిగితే అటు ఆదాయంతో పాటు ఇటు రీడర్స్ యొక్క నమ్మకాన్ని పొందవచ్చు.

Low competition niche : Finance

3. ట్రావెలింగ్: ప్రజలు టూర్లు, ప్రయాణాలు అంటే ఎక్కువగా ఇష్టపడతారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ప్రయాణాలను బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే, ఏదైనా చారిత్రాత్మక ప్రదేశానికి గానీ ఆహ్లాదకరమైన ప్లేస్ కి వెళ్ళాలి అనుకున్నపుడు వారు ముందుగా అక్కడ ఒక గైడ్ కోసం వెతుకుతారు. కాబట్టి ,అటువంటి ప్లేసెస్ గురించి మంచి రీసెర్చ్ చేసి విశ్లేషణాత్మక వివరణతో బ్లాగ్ రాయగలిగితే మీ వెబ్సైట్ కి ఎక్కువ ట్రాఫిక్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

4. టెక్నాలజీ మరియు గేమింగ్: టెక్నాలజీ ప్రపంచాన్ని కబలించింది. ప్రతిరోజూ టెక్నాలజీ పరంగా ఎన్నో గుణాత్మక  మార్పులు సంతరించుకుంటున్నాయి. టెక్నాలజీ అంటే మనం వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సాఫ్ట్ వేర్స్ మరియు అప్లికేషన్స్ ఇలా ఏవైనా కావచ్చు. వీటికి సంబంధించి క్వాలిటీ కంటెంట్ రాయవచ్చు.

5. కుకింగ్: ఆహారం లేకుండా ఈ భూమ్మీద ఏ జీవి బ్రతకలేదు. ఇక మనుషులకైతే ఆహారం పట్ల అభిరుచి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వంటలకు సంబంధించిన వీడియోస్ ని మాత్రమే చూస్తారు అనుకుంటారు చాలామంది. వంటలలో తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, టేస్టీ ఫుడ్ ని ఎంజాయ్ చేయడానికి ప్రజలు వంటలకు సంబంధించిన బ్లాగ్స్ ని కూడా చదువుతారు. ఈ అంశం కూడా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ రాయడానికి చాలా తోడ్పడుతుంది.

తక్కువ కంపెటీషన్ ఉన్న ఇలాంటి కొన్ని అంశాలపై కంటెంట్ రాయగలిగితే ఎక్కువ లాభాన్ని పొందవచ్చు.

Love to Share
Scroll to Top