Website Traffic ను విశ్లేషించడంలో మరియు SEO బూస్ట్ చేయడంలో Google Analytics ఎలా ఉపయోగపడుతుంది?

Uses of Google Analytics
Love to Share

కొత్తగా వెబ్సైట్ లేదా బ్లాగ్ మొదలుపెట్టిన వారు వెబ్సైట్ యొక్క SEO ను ఇంప్రూవ్ చేయడానికి చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే Google Search Console Install చేసి దాన్ని Google Analyticsతో అనుసంధానం చేయాలి.

Google Analytics importance

ట్రాఫిక్ ఎక్కడినుంచి వస్తుందో గమనించాలి

ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయానికి వస్తే, ఒక నియమిత సమయంలో మీ వెబ్సైట్ కు ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలించాలి.

ముఖ్యంగా ట్రాఫిక్ కొన్ని మూలాల ద్వారా మన వెబ్సైట్ కు చేరుతుంది. Social Media, Oranic Traffic, ఇతర వ్యక్తులు మీ ఆర్టికల్ ను షేర్ చేయడం మరియు Google Search చేయడం ద్వారా మీ వెబ్సైట్ కు ట్రాఫిక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని బాగా అనలైజ్ చేసి అర్థం చేసుకోవాలి.

ఏ దేశాల నుంచి ట్రాఫిక్ వస్తోంది?

మీరు రాసే ఆర్టికల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆకర్షించగలిగితే అప్పుడు మీ వెబ్సైట్ కు వేరే దేశాల నుంచి కూడా ట్రాఫిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ట్రాఫిక్ ఏ దేశాల నుంచి వస్తుందో తెలుసుకోవడానికి demographic అనే టూల్ ను ఉపయోగించవచ్చు.

నిజానికి, మీరు ఉండే దేశం నుంచే మీ వెబ్సైట్ కు ట్రాఫిక్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనితో పాటు UK, Australia, New Zealand, The United States వంటి కొన్ని  ఇతర దేశాల నుంచి కూడా మీ వెబ్సైట్ ను ప్రజలు వీక్షించవచ్చు. ఇతర దేశాల రీడర్స్ ను ఆకర్షించడం అనేది మీరు మీ ఆర్టికల్ లో పొందుపర్చిన keywords మరియు seo ఆధారంగా జరుగుతుంది.

కంటెంట్ అనాలసిస్ (Content Analysis)

మీ వెబ్సైట్ లోని ఏ పేజీలకు. ఏ పోస్టులకు ట్రాఫిక్ ఎక్కువగా వస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడం కొంచెం సంక్లిష్టమైన విషయం. అలాగే కొన్ని ఆర్టికల్స్ కు తక్కువ ట్రాఫిక్ కొన్ని పేజీలకు ఎక్కువ ట్రాఫిక్ ఎందుకు వస్తుందో అనాలసిస్ చేసి వాటిలో ఉన్న ముఖ్యమైన ఇబ్బందులను తొలగించుకోవాలి.

ఇంతేకాకుండా, పాపులర్ పేజీలకు లేదా ఆర్టికల్స్ కు ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు. ఎంత సమయం మన websiteలో ఉండగలుగుతున్నారు అనే విషయాలు వెబ్ ట్రాకింగ్ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఆర్గానిక్ సర్చ్ అనాలిసిస్ (Organic Search Analysis)

ఈ మెథడ్స్ ద్వారా మీ బిజినెస్ యొక్క పర్ఫార్మన్స్ తో పాటు వెబ్సైట్ ని చేరుకోవడంలో ఉన్న ఇబ్బందులు కూడా తెలుస్తాయి.
Organic Search Analysis

గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఆర్గానిక్ సెర్చ్ పర్ఫార్మన్స్ ను విశ్లేషించకుండా మీ వెబ్సైట్ యొక్క పర్ఫార్మన్స్ ను తెలుసుకోవడం చాలా కష్టం.

రిటెన్షన్ (Retention)

మీ వెబ్సైట్ కు చేరుకుంటున్న కొత్త విజిటర్స్ ను గుర్తిస్తూనే మీ పాత విజిటర్స్ యాక్టివిటీ మీద కూడా దృష్టి పెట్టాలి. మళ్ళీ మళ్ళీ మీ వెబ్సైట్ సందర్శించే విజిటర్స్ ద్వారానే మీ వెబ్సైట్ యొక ట్రాఫిక్ కానీ మీ బిజినెస్ కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి.

చాలా ఎక్కువ కాలం వెనక్కి వెళ్ళి ట్రాఫిక్ ను అనాలసిస్ చేయాలి.

ఎక్కువ కాలం వెనక్కి వెళ్ళి ట్రాఫిక్ ను విశ్లేషించడం ద్వారా అప్పటికి ఇప్పటికీ ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది. ఏ మూలాల ద్వారా ఈ ట్రాఫిక్ మీ వెబ్సైట్ ని చేరుకుంటుందో తెలుస్తుంది. ఇలా చేయడం ద్వారా మీ బిజినెస్ యొక్క పర్ఫార్మన్స్ తో పాటు వెబ్సైట్ ని చేరుకోవడంలో ఉన్న ఇబ్బందులు కూడా తెలుస్తాయి.

Love to Share
Scroll to Top