1. Blogging
బ్లాగింగ్ అనేది మీ website కు ట్రాఫిక్ ను పెంచడానికి ఉపయోగపడే మెథడ్స్ లో చాలా విజయవంతమైనది. మీరు పనిచేస్తున్న ఇండస్ట్రీకి సంబంధించిన ఏవైనా విషయాలను గురించి రాయాలి. అలా రాసిన కంటెంట్ ను క్రమం తప్పకుండా బ్లాగ్ లో పోస్ట్ చేస్తూ ఉండాలి. మీకు బ్లాగులో రాసే అలవాటు ఉంటే రోజూకి ఒక బ్లాగ్ పోస్ట్ అయినా రాయవచ్చు. అలా రాసిన పోస్ట్ లో మీ website ను లింకు చేయడం మరిచిపోకూడదు.
2. Social Media
సోషల్ మీడియా.. ఇది బాగా ప్రాచుర్యం పొందిన సాధనం. మీరు మీ వ్యాపారానికి సంబందించిన విషయాలను లేదా అప్డేట్స్ ను ఒక ఆర్టికల్ రూపంలో రాసి ఆ website లింకు ను facebook లేదా twitter వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మీ కస్టమర్స్ తో పంచుకోవచ్చు. Facebook అనేది బాగా జనాధరణ మాధ్యమం. దీని ద్వారా చాలా ఎక్కువ మందితో మీ సమాచారాన్ని పంచుకోవచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్ లో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
3. Email Marketing
మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ ని మళ్లించడానికి ఉన్న ఉత్తమమైన మార్గాలలో Email Marketing కూడా ముఖ్యమైనదే. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీ సేవలపై లేదా ప్రొడక్ట్స్ పై ఆసక్తి ఉన్నవారికి, ఇంతకుముందు మిమ్మల్ని సంప్రదించినవారికి మాత్రమే మీరు Emails పంపాలి. ఇలా చేయడం వల్ల మీ సేవలపై ప్రజలకు ఉన్న గౌరవాన్ని పెంపొందించుకున్నవారు అవుతారు.
4. Affiliate Marketing
ఆన్లైన్ లో passive income సంపాదించడానికి Affiliate marketing అనేది చాలా గొప్ప మార్గం. Affiliate marketing ద్వారా ప్రొడక్ట్స్ మరియు సర్వీసులను promote చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ నెలకోకసారి ఆదాయాన్ని అందిస్తే మరికొన్ని ప్రోగ్రామ్స్ కమిషన్ బేసిస్ లో ఆదాయాన్ని అందిస్తాయి. Affiliate marketing ద్వారా మంచి ఆదాయాన్ని స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు.
5. Pay-per-click advertising
గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మీ website ను ఎక్కువగా చూపించడంలో Pay-per-click advertising అనే మెథడ్ చాలా శక్తివంతమైనది. అలా అని మీ website ఎక్కువ మందికి కనిపించాలనే తాపాత్రయంలో Pay-per-click advertising మీద మరీ ఎక్కువగా ఖర్చు చేయకూడదు. Google Adwords ద్వారా మీ వెబ్సైట్ ను ప్రమోట్ చేయడానికి నెలకి కొంత డబ్బుని ఖర్చు చేయవచ్చు. ఆ డబ్బుని advertising ఖర్చుల కింద నెలకి కొంత మొత్తాన్ని తీసి పక్కన పెట్టాలి.
6. Search Engine Optimisation (SEO)
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) అనేది మీ websiteకు ట్రాఫిక్ ను మళ్లించడానికి ఉపయోగించే మరో ప్రతిభావంతమైన పద్ధతి. టైటిల్స్ లో వాడే keywords, డిస్క్రిప్షన్స్ అలాగే URLs ద్వారా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో website ర్యాంకింగ్ ను పెంచుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ websiteకి అయినా seo రాస్తే అది మొదట్లో ఎటువంటి రిజల్ట్స్ చూపించదు. SEO ద్వారా web page మంచి ర్యాంకును సాధించాలంటే కొంత సమయం పడుతుంది. ఇక్కడ చాలా ఓపికగా ఉండాలి.
7. Content Marketing
కంటెంట్ మార్కెటింగ్ అనే పద్ధతి మీ వ్యాపారాన్ని మీ కస్టమర్స్ తో ఎప్పుడూ అనుసంధానం కలిగి ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా వ్యాపార సంస్థలు తమ బిజినెస్ లకు సంబంధించిన కొత్త విషయాలను, ప్రోడక్ట్స్ మరియు సర్వీసుల గురించిన సమాచారాన్ని తమ websites లో ఆర్టికల్స్ రూపంలో రాసి వాటిని తమ కస్టమర్లతో పంచుకుంటాయి. తమకు కావాల్సిన సర్వీసులు, ప్రోడక్ట్స్ కు సంబంధించిన మంచి సమాచారాన్ని కస్టమర్లు Content Marketing రూపంలో పొందగలుగుతారు. ట్రాఫిక్ ను websites మళ్లించడంలో ఈ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందింది.
పైన చెప్పిన ఏడు పద్ధతుల ద్వారా ఏ websiteకు అయినా ట్రాఫిక్ ను మళ్లించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.