Credit Card Bill Due Date మర్చిపోతున్నారా? డోంట్ వర్రీ…

How to pay credit card bill payment?
Love to Share

RBI కొత్త రూల్స్ ఇవిగో…!!

ఈ రోజుల్లో ఒకే క్రెడిట్ కార్డు మెయింటైన్ చేస్తున్నవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే బ్యాంకుల మధ్య పోటీ పెరిగి క్రెడిట్ స్కోర్ ఆధారంగా వినియోగదారులకు కావాల్సినన్ని క్రెడిట్ కార్డులను అంటగడుతున్నారు. కష్టకాలంలో పనికొస్తాయి అన్నట్టుగా సదరు వినియోగదారుడు కూడా క్రెడిట్ కార్డులను బాగానే వాడుతున్నారు. ఇంతే కాకుండా Phone Payలో ఈ మధ్య కొత్తగా అందుబాటులోకి వచ్చిన Rent Payment, Education Fee వంటి ఆప్షన్లు క్రెడిట్ కార్డు వాడుకదార్లను బాగానే ఆకర్షిషతున్నాయి.

ఇంతవరకు బాగానే ఉంది. అయితే మామూలుగానే బిల్ due డేట్ లను మరచిపోవడం మనందరికీ అప్పుడో, ఇప్పుడో జరుగుతూనే ఉంటుంది. దీంతో బిల్లు due date లోగా కట్టలేక penalty కడుతూ బాధపడుతున్నవారు చాలా మందే ఉన్నారు. ఇవేకాకుండా ప్రతినెలా ఒకటో తేదీ వచ్చేసరికి మనం చెల్లించాల్సిన బిల్లులు కూడా ఎన్నో ఉంటాయి.

రూమ్ రెంట్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, DTH బిల్లు ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. వీటి due డేట్ లను కూడా మనం మర్చిపోతూనే ఉంటాము. అయితే వీటిలో కొన్నింటికి పెనాల్టీ ఉండకపోవచ్చు.

Credit Card Payment

కానీ క్రెడిట్ కార్డుల విషయంలో మాత్రం due డేట్ లోగా బిల్ చెల్లించకపోతే పెనాల్టీ తప్పనిసరిగా పడుతుంది. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను మెయింటైన్ చేసే వాళ్ళు due డేట్ లను మర్చిపోయి పెనాల్టీ కడుతున్నారు. ఈ సంఖ్య బాగా పెరుగుతోంది కూడా.

అయితే ఇటీవల RBI ప్రవేశపెట్టిన కొన్ని కొత్త రూల్స్ ప్రకారం ఇక పెనాల్టీ కట్టాల్సిన అవసరం రాకపోవచ్చు. అ కొత్త (RBI Rules) రూల్ ఏంటంటే.. క్రెడిట్ కార్డులు ఇచ్చిన బ్యాంకులు గానీ, ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థలు కానీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ కట్టడం మిస్ అయిన కస్టమర్ల నుంచి due date దాటిన తరువాత అదనంగా 3 రోజుల వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు (Penalty) వసూలు చేయవద్దని చెప్పింది. డ్యూ డేట్ తరువాత ఇంకో మూడు రోజులు గడువును కస్టమర్లు వాడుకునే విధంగా వెసులుబాటు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ లెక్కన కస్టమర్లు పొరపాటున క్రెడిట్ కార్డు due date లోగా బిల్లు చెల్లించడం మర్చిపోతే మరో మూడు రోజుల్లోగా బిల్లు చెల్లించవచ్చు. ఈ తేదీల్లో మీరు ఎలాంటి ఫైన్, పెనాల్టీ లేకుండా బిల్లు చెల్లించుకోవచ్చు. ఇదీ RBI కొత్త ప్రతిపాదన. బాగుంది కదూ.   

Love to Share
Scroll to Top