Google Adwords ని ఎలా అర్థం చేసుకోవాలి?

How to Use Google Adwords
Love to Share

Google Adwords అనేది Google అందిస్తున్న advertising  ప్రాడక్ట్.

What is Google Adwords?

Googleలో ఎవరైనా ఏదైనా వస్తువు గురించి గానీ, సేవల గురించి గానీ వెతికినప్పుడు ఆయా ప్రోడక్ట్స్ లేదా సర్వీసుల యాడ్స్ ను కస్టమర్లకు చూపించడానికి గూగుల్ రూపొందించిన ఈ ప్రాడక్ట్ ఉపయోగపడుతుంది. Google adwords అనే ఈ ప్రాడక్ట్ అటు వ్యాపారులకు బిజినెస్ ను పెంచడానికి ఇటు కస్టమర్లకు కావాల్సిన సర్వీసులు మరియు ప్రొడక్ట్స్ యొక్క సమాచారాన్ని కూడా అందించడానికి ఉపయోగపడుతుంది.

Google Adwords ad Campaigns

Adwords అనే ఈ ప్రాడక్ట్ వేలం (auction) అనే ప్రక్రియ ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ లో ఏదైనా వస్తువుని వెతకడానికి ఆయా సర్వీసుల లేదా ప్రోడక్ట్స్ పేరుని మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఎంటర్ చేస్తాం. వీటినే keywords అంటారు. గూగుల్ లో ఎక్కువగా వెతకబడుతున్న keywords కి గూగుల్ ఒక వాల్యూని క్రియేట్ చేసి పెడుతుంది. ఆ వాల్యూ డబ్బు రూపంలో ఉంటుంది. Google క్రియేట్ చేసిన ఈ keywords వాల్యూని బిడ్ ల ఆధారంగా కొనాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ బిడ్ వేస్తే వారి సర్వీసులు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఎక్కువ మందికి చూపించడం జరుగుతుంది.

How to Use Google Ads

Google adwords క్యాంపెయిన్ లను “పే-పర్-క్లిక్” (PPC) లేదా “పే-పర్-ఇంప్రెషన్” (PPI) అనే పద్ధతుల ద్వారా సెటప్ చేయవచ్చు. PPI అనే పద్ధతిలో అడ్వర్టయిజర్లు తమ ప్రకటనలను కావాలసినాన్నిసార్లు తమ కస్టమర్లకు చూపించే అవకాశం ఉంటుంది. కస్టమర్ యాడ్స్ పైన క్లిక్ చేసినపుడు మాత్రమే అడ్వర్టయిజర్ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. PPI అనే పద్ధతిలో కస్టమర్ చాలా తక్కువసార్లు యాడ్స్ పై క్లిక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో బ్రాండ్ ని బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సేల్స్ ఆర్డర్స్ కానీ సర్వీస్ ఆర్డర్స్ కానీ పెరగాలి అనుకుంటే PPC చాలా ఉత్తమమైన పద్ధతి.

Love to Share
Scroll to Top